calender_icon.png 31 December, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య పనుల్లో ఆరో ర్యాంకు

31-12-2025 05:32:29 PM

హైదరాబాద్: స్వచ్ఛ సురక్షన్ సర్వే ప్రకారం దేశంలో ఆరో ర్యాంకు సాధించామని, సెవెన్ స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ ధ్రువపత్రం కూడా వచ్చిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మరింత వృద్ధి సాధించాల్సి ఉందని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ప్రత్యేకంగా నెల రోజులపాటు శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ శానిటేషన్ డ్రైవ్ కు ప్రజల సహకారించాలని కోరారు. ఇప్పటికే 24 మెగావాట్ల ఆర్డీఎఫ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంటు ఉందని, మరో ప్లాంటు ఏర్పాటుకు చర్చలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఒకేచోట భారీ వేస్ట్ ఎనర్జీ ప్లాంటు నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్నామని కమిషనర్ కర్ణన్ వివరించారు.