calender_icon.png 31 December, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్లాండ్‌లో ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు

31-12-2025 05:54:30 PM

న్యూజిలాండ్: న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కిరిబాటి ముందుగా 2025 ఏడాదికి వీడ్కోలు పలికి 2026 సంవత్సరానికి స్వాగతం పలికింది. కిరిబాటిలో న్యూ ఇయర్ వేడుకలు మెదలైన గంట తర్వాత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో కొత్త సంవత్సర వేడుకల సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ ప్రజలు నగరంలోని ఐకానిక్ స్కై టవర్ పై బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

స్కై టవర్ ఫైర్ క్రాకర్స్ వెలుగులతో ప్రజలను, సందర్శకులను ఆకట్టుకుంది. 787 అడుగుల ఎత్తుల్లో ఉన్న స్కై టవర్ పై 5 నిమిషాలపాటు 3500 క్రాకర్స్ ను కాల్చారు. హార్బర్ బ్రిడ్జితో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్స్ షోలు ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందర్శకులు కేరింతలు పెడుతూ.. ఒకరినొకర్ హత్తుకుని న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ 2025కు విడ్కోలు పలికారు.