31-12-2025 05:59:53 PM
జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. కోటిరత్నం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, వెంపటి, రావులపెల్లి గ్రామాలను సందర్శించి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడి టీకాల నిర్వహణపై తగిన సూచనలు, సలహాలు అందించారు. పుట్టిన పిల్లల నుండి ఐదు (0–5) సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈవో రవికుమార్, డా. విజయ్ కుమార్, వి సి సీఎం లతీఫ్, డి వి ఎల్ ఎం నవకాంత్, ఆర్ ఎం నరేష్, ఫార్మసిస్ట్ శోభారాణి, హెల్త్ అసిస్టెంట్ గాజుల సోమన్న, యాదగిరి ఏఎన్ఎం రూప,కమల తదితరులు పాల్గొన్నారు.