03-05-2025 06:56:45 PM
ఏ ఎస్ పి చిత్తరంజన్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతంలో యువతను విద్య వైపు దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్(ASP Chittaranjan) తెలిపారు. తిర్యాణి మండల కేంద్రంలో పాత పోలీస్ స్టేషన్ భవనానికి మరమ్మతులు చేపట్టి ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ.ఎస్.పి మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పాత పోలీస్ స్టేషన్ ను లైబ్రరీగా మార్చి నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పోటీ పరీక్షల కు సిద్ధమవుతున్న యువతకు సుమారు 200 పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.నిరుద్యోగ యువత, విద్యార్థులు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిఐ బుద్దే స్వామి, ఎస్సై శ్రీకాంత్, ఆదివాసి సంఘాల నాయకులు ,విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.