calender_icon.png 4 May, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అభినందనలు...

03-05-2025 06:59:00 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శాలువ కప్పి అభినందించారు. పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన గంగోత్రి, మరో విద్యార్థి, ప్రవీణ్ కుమార్, నిషా శ్రీ, రాఘవరెడ్డిలను గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు ఏనుగు మోహన్ రెడ్డి, మాజీ విడిపి అధ్యక్షులు తిప్పారపు మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, వీడిసి కార్యదర్శి రాజలింగం, ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.