calender_icon.png 4 May, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందిస్తాం

03-05-2025 06:53:52 PM

పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి...

మహదేవపూర్ (విజయక్రాంతి): గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం వల్ల ఎర్ర చెరువులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకొని పోవడం ధాన్యం తడిసి ముద్దయిన సందర్భంగా ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందిస్తామని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ... గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఎర్ర చెరువు సమీపంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమీప అటవీ ప్రాంతం నుండి వచ్చిన వరద వల్ల 176 మంది రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయిందని, 63 మంది రైతుల వరి ధాన్యం వరదలు కొట్టుకపోవడం జరిగిందని, కొట్టుకపోయిన వరి ధాన్యం 2000 క్వింటాల్ ఉందని, ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని విపత్తుపై ప్రాథమిక సహకార సంఘం ద్వారా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని వెంటనే స్పందించి మంత్రి జిల్లా కలెక్టర్ ను నష్టం జరిగిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించడం జరిగింది.

వెంటనే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, సబ్ కలెక్టర్ మాయంకా సింగ్ తో కలిసి వచ్చి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నష్టపోయిన రైతుల వరి ధాన్యాన్ని లెక్కించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే కొనుగోలు ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని మొలక రాకముందే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఈ అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయిన వరి ధాన్యాన్ని లారీలల్లో నింపి మిల్లులకు తరలించడం కొనసాగుతుందని, అకాల వర్షం భారీగా నష్టపోయిన రైతులకు మంత్రితో మాట్లాడి ఈవిపత్తుకు ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

బిజెపి, టీఆర్ఎస్ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రకృతి విపత్తుకు ఎవరు ఏం చేయలేరని జరిగిన నష్టానికి రైతులను ఓదార్చే ప్రయత్నం చేయాలని కావాలని మంత్రిని అతని సోదరుని వల్లే ఈ విపత్తు జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని విమర్శలు వదిలివేసి జరిగిన నష్టానికి రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ రాణీ బాయి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వామన్ రావు, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.