09-06-2025 01:08:31 AM
కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటి ఆమని, ప్రముఖ టీవీ యాక్టర్, సినీ నటుడు ప్రభాకర్, రాష్ట్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరై వార్షికోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఆమని పాటలతో 30 మంది మహిళా మణులు సామూహికంగా డ్యాన్సులు చేసి అలరించడంతో ప్రముఖ నటి ఆమని, టీవీ యాక్టర్ ప్రముఖ నటుడు ప్రభాకర్ కలిసి తొలిచూపు చాలంట ... ప్రేమ అనేది పుట్టగా పదిమంది అంటుంటే విన్నాను అని పాటపై స్టెప్పులు వేశారు.
చిన్నారులతో నృత్య ప్రదర్శనలు అలరించాయి. కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జాతీయ నృత్య కళాకారుడు వంశీ ప్రతాప్ గౌడ్ కళా నృత్యాలతో అలరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు