7 July, 2026 | 1:10 AM

హనుమాన్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

09-06-2025 01:07 AM

పటాన్ చెరు, జూన్ 8 : గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని మాదారంలో 33 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి  గ్రామస్తులు ఆదివారం భూమిపూజ చేశారు.   రామాలయం ఆవరణలో పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణంచే స్థలంలో భూమిపూజ అనంతరం హోమం నిర్వహించారు.  33 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం  సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమం పండగను తలపించింది.

గ్రామ తాజీమాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, గ్రామస్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్,  కలాల్ రాజు గౌడ్, స్వామి రాజ్, బీజేపీ మండల అధ్యక్షులు జగన్ రెడ్డి,  రాష్ట్ర బీఆర్‌ఎస్ యువనేత  మాణిక్ యాదవ్,  యువకులు, గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.