17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ముదిరాజుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

09-06-2025 01:09 AM
  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

అమీన్ పూర్‌లో ముదిరాజ్ 

భవన నిర్మాణానికి శంకుస్థాపన 

పటాన్ చెరు, జూన్ 8 :పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ముదిరాజుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ముదిరాజ్ భవనం పనులకు ఎమ్మెల్యే ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

సేవా దృక్పథం.. ధైర్యానికి మారుపేరైన ముదిరాజులు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ముదిరాజుల కోసం సొంత నిధులచే సంక్షేమ సంఘ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పటాన్ చెరులోని ముదిరాజ్ భవన్ ను రూ.రెండు కోట్ల సొంత నిధులతో ఆధునీకరించినట్లు గుర్తు చేశారు. అమీన్ పూర్ లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన్ నిర్మాణానికి సైతం త్వరలోనే నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ ముదిరాజులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేష్, బాలరాజు, ఉపేందర్, కృష్ణ, బిజీలీ రాజు, చదువుల మల్లేష్, రాములు, బాశెట్టి అశోక్, రాజేష్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి  

నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో పటాన్ చెరు పట్టణానికి చెందిన జీఎంఆర్ ఆటో యూనియన్ అధ్యక్షులు దస్తగిరికి ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఆటో డ్రైవర్లకు తగు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోనూ సముచిత ఇండ్లను కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. అనంతరం దస్తగిరిని అభినందించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి  తీరని లోటు 

పటాన్ చెరు, జూన్ 8 : జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా మూడుసార్లు శాసన సభకు ఎన్నికై ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సాధించుకున్న గోపీనాథ్ మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు.

ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.