ఓటెత్తిన ‘ఖమ్మం’ జనం
75.19 శాతం పోలింగ్
ఖమ్మం, మే 13 (విజయక్రాంతి): ఓటర్లు సంబురంగా ఓట్ల పండుగలో పాల్గొన్నారు. ఈసీ పోలింగ్ సమయం గంట పొడిగించడంతో ఓటర్లు ఆ సమయాన్నీ సద్వినియో గం చేసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ ముగిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామస్థులు తమ డిమాండ్లను పరిష్కరించాలని పోలింగ్‌ను బహిష్క రించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు వారికి నచ్చజెప్పారు. ఎట్టకేలకు గ్రామస్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో పోలింగ్‌శాతం
సాయంత్రం 9 గంటల వరకు పార్లమెం ట్ నియోజకవర్గంలో 75.19 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించారు. ఖమ్మం నియోజకవర్గంలో 5 గంటల వరకు 59.92 శాతం, పాలేరు 77.11శాతం, మధిర 76.97 శాతం, వైరా 75.22 శాతం, సత్తుపల్లి 74.42 శాతం, కొత్తగూడెం 62.31శాతం, అశ్వారావుపేట 76.67 శాతం నమోదైంది. అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.
లెక్కల్లో అభ్యర్థులు..
పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో అభ్యర్థులు కూడికలు తీసివేతలు ప్రారంభిం చారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి అనుకూలం, ఎవరికి అననుకూలం, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో 90శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నా పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఓ సామాజికవర్గానికి చెందిన ఒక గ్రూపు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో 76శాతం పోలింగ్ జరిగిన ప్రాంతాల్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో 60శాతం పోలింగ్ నమోదుకావడం గగనమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలింగ్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.




