31-07-2025 12:12:32 AM
ఎస్పీ శరత్ చంద్రపవార్
మునుగోడు(మర్రిగూడ), జులై 30 : అసాంఘిక కార్యకలాపాలు గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియస్ రైస్ అక్రమ రవాణా, జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపి చట్టపరంగా శిక్షపడేలా చూడాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ అన్నారు. బుధవారం దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి మాట్లాడారు.
స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వచ్చిన పిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్త్స్రకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, ఎస్.ఐ కృష్ణా రెడ్డి, స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.