31-07-2025 12:12:41 AM
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జులై 30 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రజలను కొందరు నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, 118 జీవోపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. బీఎన్ రెడ్డి డివిజన్ లోని వైదేహినగర్ నార్త్ కాలనీలో బుధవారం ఎమ్మెల్యేకు కృతజ్ఞత సభ నిర్వహించారు. వైదేహినగర్ నార్త్ కాలనీలో రోడ్ నెంబర్ 1లో చిన్నపిల్లల పార్కును ఏర్పాటు, రోడ్ నెంబర్ 12 లో ఓపెన్ జిమ్ ఏర్పాటు, శివాలయం నుంచి సాయిబాబా గుడి వెనుక వైపున ఉన్న ఆర్చి రోడ్డు వరకు సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిధులు మంజూరు చేయించి, పనులను పూర్తి చేయించారు.
ఈ మేరకు వైదేహినగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల రాంబాబు, కార్యదర్శి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మ 118 జీవో ద్వారా కన్వేయన్స్ డీడ్స్ ను చివరి ఇంటి యజమాని వరకు ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ముందుగా బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ చైతన్య నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పై నిర్మించిన అదనపు అంతస్తు భవనాన్ని, ఎస్ కే డీ నగర్ లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ లచ్చిరెడ్డి ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ చౌదరి, నాయకులు లక్కరాజు ప్రశాంత్, సుమన్ గౌడ్, సతీష్ గౌడ్, సుధాకర్ యాదవ్, హనుమంత రావు, వైదేహి నగర్ కాలనీ అసోసియేషన్ కార్య నిర్వాహక సభ్యులు రాజేందర్ రెడ్డి, నాగరాజు, రామనాథ్ రెడ్డి, అన్నంరాజు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ప్రసాద్, కృష్ణ, ప్రభాకర్, ఆదిత్య, వేణుగోపాల్, ఈమని కృష్ణ, వెంకటేష్ గౌడ్, చక్రధర్, రాజన్, రాములు, లక్మీనర్సింహ స్వామి ఆలయ చైర్మన్ సోమిరెడ్డి, ఎస్ కేడీ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కన్వీనర్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్లు కృష్ణారావు, పోనుగోటి శ్రీధర్ రావు, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి, కాలనీ ఉపాధ్యక్షుడు రమణ, సెక్రెటరీ జానకి రామారావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, తదితరులుఉన్నారు.