calender_icon.png 27 July, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుకోని అస్త్రం బనకచర్ల?

27-07-2025 12:17:32 AM

బీఆర్‌ఎస్ పార్టీకి అనుకోని అస్త్రంగా బనకచర్ల మారిందన్న టాక్ రాజకీయ వర్గా ల్లో వినిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఈ గోదావరి బనకచర్ల అంశం ప్రధాన ఎజెండాగా మార్చాల న్న యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు, గోదావరి, కృష్ణా జలాలు, తెలంగాణ నీటి హక్కులు వంటి అంశాలపై అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో హో రెత్తిస్తున్నారు.

డిల్లీలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎం భేటీలో బనకచర్ల ఎజెండాలో లేదని అధికార పక్షం చెప్పగా, గులాబీ పార్టీ ఏమో బనకచర్లపై చర్చ జరిగిందని, ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణగా గోదావరి జలాలను ఇస్తున్నారని ఆరోపించారు. తాజాగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బనకచర్ల ప్రధాన అంశంగా సదస్సు నిర్వహించారు. కారు పార్టీ అగ్రనేతలు తమ స్పీచుల్లో బనకచర్లను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో స్టూడెంట్స్‌కి తెలియజేశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రజలు మాత్రం గులాబీ పార్టీకి బనకచర్ల బ్రహ్మస్త్రంగా వాడుకునేలా కనిపిస్తోంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

 తమ్మనబోయిన వాసు