27-07-2025 12:16:09 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకు ప్రభు త్వం అనుమతులిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఈ విద్యాసంవత్సరానికిగానూ జీకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి అనుమతులిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కోర్సులకు అనుమతులిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విద్యాసంవత్సరం ఎప్‌సెట్ రెండో విడ తలో 30,941 సీట్లకు కౌన్సెలింగ్ ను చేపట్టనున్నట్లు మరో ప్రకటనలో అధికారులు తెలిపారు.