calender_icon.png 27 July, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృతా? బీఆర్‌ఎస్సా?..ప్లీజ్ క్లారిటీ!

27-07-2025 12:18:55 AM

కవిత..ఈ పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. కేసీఆర్ కూతురుగా, జాగృతి అధినేత్రిగా తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకు తెలియాల్సింది మరొకటి ఉంది. అదే కవిత ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని?. అవును రాష్ట్ర ప్రజలకు ఈ విషయంలో క్లారిటీ మిస్ అయింది. గతంలో ఏ కార్యక్రమం చేపట్టిన కవిత బీఆర్‌ఎస్ పార్టీపైనే చేసేవారు. కానీ బీఆర్‌ఎస్‌లో దెయ్యాలున్నాయని కవిత ఆ మధ్య చేసిన కామెంట్ కాన్నుంచి తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా ‘లీడర్’ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపితీరుతుందన్నారు. ఇప్పుడిదే చర్చకు దారితీసింది. అంటే కవిత బీఆర్‌ఎస్‌లో ఉన్నారా? లేదా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఉంటే బనకచర్లను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందనాలి గానీ, జాగృతి ఆపుతుందని అనడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బనకచర్లను ఆపడం, ఆపకపోవడం తర్వాత చేద్దురు గానీ, ముందు..మీరు బీఆర్‌ఎస్‌లో ఉన్నారా? లేరా? ఉంటరా...ఉండరా? అనేది క్లారిటీ ఇవ్వాలని కవితక్కను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 రమేశ్ మోతె