వాగులో పురాతన శిల్పం లభ్యం
04-03-2026 12:00 AM
12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తింపు
మహబూబాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ అటవీ సమీపంలోని వాగులో పురాతన కాలంనాటి మహావిష్ణువుగా భావిస్తున్న అపురూప శిల్పం లభించింది. వాగులో నీరు తగ్గిపోవడంతో బయటపడ్డ విగ్రహాన్ని గుర్తించిన ప్ర జలు బయటకు తీసి పూజలు నిర్వహిస్తున్నా రు. పురావస్తు నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం ఈ విగ్రహం 11, 12 వ శతాబ్ద కాలానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. శిల్ప శైలిని బట్టి కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలానికి చెందిందని అంచనా వేస్తున్నారు.




