calender_icon.png 12 November, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

12-11-2025 01:00:48 PM

తూప్రాన్,(విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లా పాషా మైలారం నుండి మహారాష్ట్ర నాందేడ్ కు 340 క్వింటాళ్ల ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలించే క్రమంలో టాస్క్ఫోర్స్ అధికారులైన డీఎస్పీ రమేశ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరసింహులు, అజయ్, సాయి కుమార్ లు నమ్మదగిన సమాచారం మేరకు వాహనాన్ని వెంటాడి తూప్రాన్ లోని బైపాస్ లో పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. పట్టుకున్న వాహనాన్ని తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచారు. అనంతరం తూప్రాన్ లోని పౌర సరఫరాల గోదాములలో వీటిని భద్రం చేయడం జరిగిందని రాష్ట్ర సివిల్ సప్లై డి.ఎస్.పి. రమేష్ రెడ్డి అన్నారు. డైవర్, క్లీనర్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు. ఇందులో సివిల్ సప్లై జిల్లా ఇన్స్పెక్టర్లు నరసింహులు, ఇన్స్పెక్టర్ అజయ్, సాయి కుమారులు ఉన్నారు.