22 June, 2026 | 12:12 AM

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

16-06-2024 12:45 AM
  • అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్ర మించే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హెచ్చరించారు. టోలీచౌకిలోని ఎస్‌ఏ కాలనీ ఎదురుగా సెవెన్ టూం బ్స్ రోడ్‌లో గల సర్వేనెంబర్ 179లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ ప్రహరీని శుక్రవారం రాత్రి పొక్లెయినర్లతో కూల్చి వేశారు అధికారులు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని ఫిల్మ్‌నగర్ సీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. 1120 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల ఈ భూమి షేక్‌పేట్ మండల పరిధిలోకి వస్తుందని షేక్‌పేట్ తహశీల్దార్ స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని టోలిచౌకి ట్రాఫి క్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సికింద్రా బాద్ ఆర్డీవో దశరథ్‌సింగ్, సర్వేయర్ సాయికాంత్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.