31-08-2025 08:37:07 PM
సనత్‌నగర్: అమీర్‌పేట్‌లోని ఆండ్రోమెడా సుబ్బు వెర్టికల్ కార్యాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం 5వ రోజు సకల శోభాయమానంగా నిమజ్జనం చేయబడింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లడ్డూ వెలంపాటలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో సిబ్బంది సభ్యుడు ప్రదీప్‌కుమార్ రూ.11,000/-లకు లడ్డూను విజయవంతంగా వేలం చేశారు. అనంతరం లడ్డూ హరతి చేసి, భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.తరువాత ప్రారంభమైన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఆఫీసు ప్రాంగణం నుంచి ట్యాంక్‌బండ్ వరకు అంగరంగ వైభవంగా కొనసాగింది. డప్పుల సవ్వడులు, భక్తుల నృత్యాలు, గణేశ నామస్మరణలతో ఊరేగింపు శోభాయమానంగా సాగింది.