31-08-2025 08:34:02 PM
సికింద్రాబాద్ నుండి నాగపూర్ నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో హల్టింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఆదివారం పట్టణంలోని బి1 క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.
వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో నిలుపుదల కోసం గత కొన్ని నెలల నుండి పార్లమెంటు సమావేశాలలో ఎంపి వంశీ గలం వినిపించారని, మంచిర్యాల జిల్లా ప్రజల ఆకాంక్షను పేద మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులతో చర్చించి వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పించారన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత గడ్డం కుటుంబానికి దక్కుతుందన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతంలో చరిత్ర రాయాలన్న తిరగరాయాలన్న గడ్డం ఫ్యామిలీకే సాధ్య మన్నారు.