01-09-2025 12:37:49 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
కోదాడ ఆగస్టు 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన వికలాంగులు చేయుత పెన్షన్ దారుల కోదాడ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు ఒంటరి మహిళలకు 4000 రూ, వికలాంగులకు 6000 రూ, పెన్షన్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేయడాన్ని ఖండించారు.
హైదరాబాద్ లో సెప్టెంబర్ నెలలో లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలతో మహా గర్జన సభను విజయవంతం చేయాలన్నారు. వీహెచ్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు మాదిగ,
జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు, బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, రుద్ర సురేష్ మాదిగ, కర్ల విజయరావు, పులి నాగేశ్వరరావు, ఏపూరి రాజు మాదిగ, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, ఏపూరి సత్యరాజు పాల్గొన్నారు.