01-09-2025 12:38:29 AM
-బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్
మంచిర్యాల, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద నీటిలో మంచిర్యాల పట్టణం, పాత మంచిర్యాల గోదావరి తీర ప్రాంతంలోని పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, వంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం నీట మునిగిన పంటలను బాధిత రైతులతో కలిసి పరిశీలించారు. ప్రణాళిక లేకుండా ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో పంటలు నీట మునిగాయని, వరదతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ. 40 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అమిరిశెట్టి రాజ్ కుమార్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, బియ్యాల సతీష్ రావు, రాజమౌళి, రవీందర్, అశోక్, రైతులు పాల్గొన్నారు.