03-05-2025 12:11:15 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 1 (విజయక్రాంతి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు మ రణాలను లేకుండా చేయటం, గర్భిణీలు బా లింతలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యం తో ఏటా రుకోట్ల నిధులను వెచ్చిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది లక్ష్యాన్ని నీరు గారు వస్తున్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అంగన్వాడి ఉన్నతాధికారుల నుంచి కొంతమంది సూపర్వైజర్లు అం గన్వాడీ టీచర్ల వరకు పేదల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లక్ష్యాన్ని నీరు గారు వస్తున్నారని విమర్శలు వెలబడుతున్నాయి. జిల్లాలో ఏ కేంద్రంలోనూ నమోదు చేసిన చిన్నారులు ఏ రోజు పూర్తిస్థాయిలో కేంద్రాలకు వచ్చిన దాఖలాలు లేవనీ, హాజర్ ఫు ల్లు...
చిన్నారులు నిల్ అన్న చందాన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. ఆ విధానాన్ని చక్క పెట్టాల్సిన సూపర్వైజర్ వ్యవస్థ సిడిపిఓలు జిల్లా స్థాయిలో పీడీలు వ్యవహరించే ఉదాసీనత గ్రామస్తుల భాగస్వామ్యం లేమీ కారణంగానే అంగన్వాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని పరిశీలకులు అంటున్న మాట.
అడుగడుగునా అక్రమాలే..
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అడుగ డుగునా అన్ని అక్రమాలే చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సొంత ఇళ్ళలో కేంద్రాలు నిర్వహించరాదనే నిబంధనను తుంగలో తొక్కి కేంద్రాలను సొంత ఇండ్లలో కొనసాగిస్తున్నారు. విషయము తెలిసిన అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
కేంద్రాలకు ప్రతినె ల మూడుసార్లు కోడిగుడ్లు సరఫరా చేయా ల్సి ఉన్న ఆఫీస్ సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. నెలలో మొదటివారం, చివరి రోజుల్లో రెండు పర్యాయాలు మాత్రమే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డులు మాత్రము పూర్తిగా సరఫ రా చేస్తున్న ట్లు నమోదు చేస్తున్నారనీ తెలుస్తోంది. సిడిపిఓ స్థాయి అధికారులు విధులు నిర్వహించడానికి ప్రభుత్వం అద్దె వాహనాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
అదే కొందరు సిడిపి ఓ లపాలిటీ వరంగా మారిందనీ తెలుస్తోం ది. కొందరు సిడిపివోలు అద్దె వాహనాలను వినియోగించకుండానే బిల్లులు డ్రా చేసిన ట్లు ఆరోపణలు ఉ న్నాయి. జిల్లాలోని మారుమూల మండలమైన దుమ్ముగూడెం గతం లో పనిచేసిన ప్రాజెక్టు అధికారి వాహనం వినియోగించకుండా తప్పుడు పత్రాలతో అద్దె వాహనం వినియోగించినట్లు నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మరి కొంతమంది వాహనాలు పెట్టకున్నా పెట్టినట్లు బిల్లులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి పీ డీ స్తాయి అధికారి అండదండలు మెండుగా ఉ న్నట్లు విమర్శలు వెలబడుతున్నాయి. ప్రస్తు తం ఆ ప్రాజెక్టు ఇన్చార్జి అధికారితో కొనసాగుతోంది. అప్పట్లో పనిచేసిన సిడిపిఓ స్థానికంగా ఉండరు. సమయానికి రారూ అన్నట్లు వ్యవహరించారని, వచ్చిన రోజుల్లోనే విధిలో నిర్వహిం చినట్లు సంతకాలు చేసేవారని, కల్లూరు నుం చి చుట్టం చూపుగా రాకపోకలు సాగించారని గ్రామస్తులు తెలిపారు.
ఆ విషయం తెలి సిన ఐసిడిఎస్ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడమే వారిపై వస్తున్న ఆరోపణలు ధ్రువపరుస్తున్నాయి. ప్రస్తుతం ఆ అధికారి కల్లూరుకు డిప్యూటేషన్ పై వెళ్ళారని, ఆమె స్థానంలో సిరిసిల్ల జిల్లా నుంచి మరో అధికారి ఏ సి డి పి ఓ హోదాలో బూ ర్గంపాడు ప్రాజెక్టుకు డిప్యూటేషన్ పై వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకే దుమ్ముగూడెం సిడిపిఓ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టులో ఏ సిడిపిఓ పోస్ట్ లేకు న్నా ఇన్చార్జి ఎలా ఇచ్చారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో ఏ ఫైలు పైన సంతకం కావాలన్నా కల్లూరు వెళ్లి అక్కడి అధికారితో సంతకాలు చేయాల్సి వ స్తోందని సిబ్బంది వాపోతున్నారు.
దీంతో దుమ్ముగూడెం ప్రాజెక్టులో గతము నుంచి అస్తవ్యస్తవ్యవస్థ కొనసాగుతోందని తెలుస్తోంది. జిల్లాలో ఇది ఒక మచ్చుతునక మా త్రమే. మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే తరహా తంతు కొనసాగుతోందని తెలుస్తోంది. పర్యవేక్షణ లోపం కారణంగా కేంద్రాల పనితీరు సక్రమంగా సగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం;
ప్రధానంగా మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహారం సరఫరా, ఆటపాటల విద్యతో చిన్నారులకు బడికి అలవాటు చేయాలని లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటరు కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. కేంద్రం పరిధిలో 3 నుంచి 5 సంవత్సరాల వయసుగల చిన్నారులను గుర్తించి పేర్లు నమోదు చేస్తారు. వారిని నిత్యం కేంద్రాలకు తీసుకువచ్చి ఆటపాటలతో విద్యను అలవాటు చేయటం, మధ్యాహ్నం భోజనం వండి పెట్టటం చేయాల్సి ఉంటుంది.
ప్రతినెల చిన్నారుల ఎదుగుదలపై నివేదిక ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఆచరణలో మాత్రం కేవలం చిన్నారులు రాకున్నా పూర్తిస్థాయిలో హాజరు వేస్తుంటారు ఆటపాటల విద్యను అటుకెక్కించి కేవలం మధ్యహ్నం భోజనం వండి పెట్టే కేంద్రాలుగానే రూపాంతరం చెందాయి. దీంతో పాటు యుక్త వయసు బాలికలు బాలింతలు గర్భిణీలను గుర్తించి వారికి పౌష్టికాహారం అం దించాల్సి ఉంటుంది.
ఇమ్యునైజేషన్ విధులు ఆరోగ్యశాఖతో సమన్వయం చేస్తూ నిర్వహించాలి. దీంతో 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలను సంపూర్ణ ఆరోగ్య వంతుగా తయారు చేయడం అంగన్వాడీ కేంద్రాల పని. ఇంతటి మహోన్నత లక్ష్యంలో స్థానిక ప్రజలను భాగస్వాములు చేయాల్సి ఉంది. కానీ కొంతమం ది స్వార్థం, ధనాపేక్ష కారణంగా నీరు గారుస్తున్నారని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
ఆ లక్ష్యం నెరవేరాలంటే అంగన్వాడీ కేం ద్రాల విధివిధానాలపై ఆ పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలకు, యువతకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం కేంద్రాల్లో పే ర్లు నమోదు చేసిన వారి కుటుంబ సభ్యుల సమక్షంలోని అంగన్వాడీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించి మమ అనిపిస్తుంటారు.అక్కడే అక్రమాలకు తప్పుటడు గుప డుతోంది.
చిన్నారులు కేంద్రాలకు రాకున్నా, లబ్ధిదారులకు గుడ్లు పాలు అమృత హస్తం ప్యాకెట్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. మరి కొంతమంది అందిన కాడికి కమిషన్లు పు చ్చుకోవడం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీచర్ల రికార్డులో నూటికి నూరు శా తం విధులు నిర్వహిస్తున్నట్లు నమోదు చేయడంతో అక్రమాలకు తెరలేస్తోంది.
దా న్ని ఆసరా చేసుకొని కొందరు సూపర్వైజర్లు, మరికొందరు సిడిపివోలు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు అనేక సందర్భాల్లో ఆరోపణలు బహిర్గతమయ్యాయి. ఇందిరమ్మ ప్రభుత్వం లోనైనా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని, లక్ష్యం నెరవేరేలా తగు చర్యలు తీసుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.