calender_icon.png 3 May, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురును యూనివర్సిటీకి పంపేందుకు వెళ్తూ..

03-05-2025 12:12:09 AM

- విమానం దిగగానే ఎయిర్ పోర్టులో వ్యక్తి మృతి

 రాజేంద్రనగర్, మే 2: కూతురును యూనివర్సిటీకి పంపించేందుకు  వెళ్తుండగా ఓ వ్యక్తి ఎయిర్పోర్టులో విమానం దిగగానే కుప్పకూలిపోయి మృతి చెందిన సంఘటన ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

న్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వి వరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆజాద్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కూ తురు కర్ణాటకలోని షాహిన్ యూనివర్సిటీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆ జాద్ తన కూతురుని యూనివర్సిటీలో చే ర్పించేందుకు గురువారం స్వస్థలం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు.

విమా నం దిగగానే అరైవల్ పిల్లర్ వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి కిందపడ్డాడు. వెంటనే ఎయిర్పోర్ట్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్ప టికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం మృతుడి సోదరుడు సజ్జత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.