27-11-2025 10:36:40 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని ఉమ్మడి కొత్త దొనబండ తండా గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి వెంకటేశ్వర్లు గురుస్వామి సంకల్పంతో రాజేష్ గురుస్వామి భరత్ గురుస్వామి ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం హనుమాన్ దీక్ష స్వాముల సంకల్పంతో స్వామివారి మహా సంకల్ప పాదయాత్ర, రథోత్సవం భక్త జన బృందంతో మేళ తాళాలతో స్వామివారి రథంపై ఊరేగింపుతో స్వాముల భజనలతో అంగరంగ వైభవంగా ప్రారంభమై మండలంలోని హనుమంతుల గూడెం శ్రీ శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు రథోత్సవం పాదయాత్ర కార్యక్రమం దేదీప్యమానంగా హనుమాన్ శోభయాత్ర ప్రత్యేక రథంపై స్వామివారు అభయమిస్తూ ప్రతి గ్రామ వీధులలో మంగళ హారతులు నీరాజనాలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తూ భగవంతుని నామ కీర్తనలతో గ్రామ వీధులు వాడలు మారుమోగే విధంగా స్వామివారి పాదయాత్ర రథోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయింది.
తదుపరి స్వామి వారి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం హనుమంతుల గూడెం శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వహించారు. ఈ మహా సంకల్ప పాదయాత్ర, రథోత్సవం అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్త మహాశయులకు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ శ్రీ వెంకటేశ్వర్లు గురుస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.