27-11-2025 10:31:34 PM
అమీన్ పూర్: కృష్ణరెడ్డిపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ దండ్ల సత్యనారాయణ కిరణ్ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో బిఆర్ఎస్ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొని, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పల్లకి సేవలో పాల్గొన్నారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ పవిత్ర సందర్భంలో స్వామివారి సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని మాణిక్ యాదవ్ తెలిపారు. ఆధ్యాత్మిక శోభతో, భక్తి పరవశంతో వైభవంగా నిర్వహించారని తెలిపారు.