27-11-2025 11:35:02 PM
చేగుంట: ఆటో నడపడానికి వెళ్లి వ్యక్తి కనిపించకుండాపోయిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మసాయిపెట్ పట్టణ కేంద్రనికి చెందిన యాదగిరి(40) అనే వ్యక్తి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈనెల 24న ఆటో నడపడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.