27-11-2025 10:41:33 PM
మునిపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని కంకోల్ గ్రామంలో బెల్టు షాపులు నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు, మన్నే నవీన్ లు నడుపుతున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఎవరు కూడా బెల్ట్ షాప్స్ నడపవద్దని, ఒకవేళ నడిపినచో కేసు నమోదు చేసి, ఎమ్మార్వో ముందు బైండ్ ఓవర్ చేస్తామని హెచ్చరించారు.