calender_icon.png 28 November, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్

27-11-2025 11:22:21 PM

జిల్లా ఫైర్ అధికారి మురళీ మనోహర్ రెడ్డి..

అత్తాపూర్ లో మాక్ డ్రిల్

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): బహుళ అంతస్తుల భవనాలలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలలో అవగాహన కల్పించడానికి విస్తృతంగా మాకు డ్రిల్ లను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి మురళి మనోహర్ రెడ్డి వెల్లడించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీరాం హరన్ అపార్ట్మెంట్లో అగ్నిమాపక శాఖ పెద్ద ఎత్తున మార్క్‌అగ్నిమాపక శాఖ పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్ లో  వంటింట్లో అగ్ని ప్రమాదం నుంచి మొదలుకొని అపార్ట్మెంట్లో అన్ని కోణాలలో జరిగే ప్రమాదాలపై ఫైర్ ఫైటర్లు ప్రాక్టికల్ గా అవగాహన కల్పించారు.

మహిళలు స్థానికులు ఈ మార్క్ డ్రిల్ లో ప్రతి సంఖ్యలో పాల్గొని ప్రమాదాల నివారణ జాగ్రత్తలను ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. చిన్నచిన్న అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించడానికి  ప్రజలలో ముఖ్యంగా మహిళల్లో అవగాహన అత్యవసరమని గుర్తించి మాక్ డ్రిల్లను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లీడింగ్ ఫైట్ ఫైటర్లు జే. రాము, ఇతర సిబ్బంది దామోదర్ రెడ్డి, రమేష్,వెంకట్, గోపాల్ తదితరులు ప్రాక్టికల్ గా వివరించిన తీరు చాలా బాగుందని లక్ష్మీరాం హరన్ అపార్ట్మెంట్ వాసులు స్థానికులు ప్రశంసించారు.