27-11-2025 11:14:17 PM
హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలోనూ, పలు కోర్సుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ శివ్ నాడార్ యూనివర్సిటీ ఇంటర్ డిసిప్లినరి హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ లో భారతదేశంలో మొదటిసారి బీఏ (పరిశోధన) కార్యక్రమం ప్రారంభించింది. పెరుగుతున్న సంక్లిష్టమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి సమర్థవంతులైన నిపుణులను ప్రోత్సహించడానికి దీనిని తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్తలు, స్కూల్ నాయకులు, అకాడమీషియన్స్ హాజరయ్యారు. భారతదేశపు ఉన్నత విద్యకు సంబంధించి ఇది కీలకమార్పుగా చెబుతున్నారు.
ఆర్కియాలజీ; హెరిటేజ్ మరియు హిస్టారికల్ స్టడీస్; లేదా సొసైటీ, కల్చర్ అండ్ టెక్నాలజీ వంటి మూడు ప్రత్యేకతల్లో విద్యార్థులు ఒకటి ఎంచుకోవడానికి ముందు నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ , జియో-పాలిటిక్స్, బిజినెస్, ఏఐ మరియు ఇతర డొమైన్స్ లో విస్తరించిన పాఠ్యాంశాలను అందిస్తుందని వెల్లడించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణమైన ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో పది పూర్తి ఉపకారవేతనాలను ప్రకటించింది. నాలుగు సంవత్సరాల కోసం 100% ట్యూషన్ ఫీజును ఇది కవర్ చేస్తుంది. ఇదే కాకుండా, పలు యూనివర్శిటీ వారీ ఉపకారవేతనాలు , ఆర్థిక సహాయ అవకాశాలు కూడా ఉన్నాయి. తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో అత్యుత్తమంగా రాణించాలనుకునే అభిరుచి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నట్టు శివ్ నాడార్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ డాక్టర్. రాజీవ్ కుమార్ సింగ్ చెప్పారు