08-11-2025 09:17:37 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామంలో ఆంజనేయ స్వాముల, గురు స్వాములు, రమేష్, రాజేష్, భారత్ ఆధ్వర్యంలో మహ పడిపూజ కార్యక్రమంలో భాగంగా గురుస్వాములు వెంకటేశ్వర్లు, తిరుపతయ్య సారధ్యంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం గ్రామ విధుల్లోకి ఊరేగింపు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం గురుస్వాములు స్వామివారికి అభిషేకం, పడిపూజ మంగళవాయిద్యాల మధ్య కొనసాగింది.
భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి పూజ తర్వాత పంచామృతాభిషేకం నిర్వహించారు. మంగళ హరతితో పూజ కార్యక్రమాలు ముగిశాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాలధారణ భక్తుల పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అనంతరం స్వాములు మహ అగ్నిగుండం దాటారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వాములు, అయ్యప్ప స్వాములు, శివుడు స్వాములు, భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.