08-11-2025 09:53:53 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మెన్ చిన్నపట్ల ప్రతాప్ రెడ్డి, నందు పటేల్, ఒంటరి నారాయణ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షుడు బ్యాతయ్యా, కాంగ్రెస్ సీనియర్ యూత్ అధ్యక్షుడు మంగలి జగదీష్, కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎల్.హన్మంతు, కాంగ్రెస్ నాయకులు చిన్నపట్ల రామ్ రెడ్డి, బాసిరెడ్డి గారి రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జక్కుల అరుణ్, మొహమ్మద్ హుస్సేన్ సిర్గాపూర్ తదితరులు పాల్గొన్నారు.