calender_icon.png 12 August, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో అంకిత జోడీ

26-10-2024 12:00:00 AM

ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా జరుగుతున్న డబ్ల్యూ 35 కాయ్‌సెరీ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా డబుల్స్ విభాగం లో సెమీస్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అంకిత-జకుపొవిక్ (స్లొవేనియా) జంట 6-3, 6-3తో బొజికా-వొనారు (రొమేనియా) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరగనున్న డబుల్స్ సెమీస్‌లో ఈ జోడీ కొలొడిన్స్‌కా- కుజ్మోవాను ఎదుర్కోనుంది. డబుల్స్‌లో సెమీస్ చేరిన అంకిత సింగిల్స్‌లో మాత్రం క్వార్టర్స్‌కే పరిమితమైంది.