26-10-2024 12:00:00 AM
కివీస్‌తో హాకీ మ్యాచ్ డ్రా
జొహొర్ బహ్రూ: మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత్ 3-3తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (ఆట 6వ నిమిషంలో), రోహిత్ (17వ ని.లో), తలేమ్ (60వ ని.లో) గోల్స్ సాధించగా.. న్యూజిలాండ్ తరఫున జాంటీ ఎల్మ్స్ (7, 32, 45వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు.
ప్రస్తుతం 10 పాయింట్లతో భారత్ పట్టికలో టాప్‌లో కొనసా గుతున్నప్పటికీ ఆస్ట్రేలియా, బ్రిటన్ మ్యాచ్ లు ముగిసిన తర్వాతే ఫైనల్ ఎవరు ఆడతారనేది స్పష్టత రానుంది. బ్రిటన్‌తో జపాన్, ఆస్ట్రేలియాతో మలేషియా తలపడనున్నా యి. చివరి క్వార్టర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఇరుజట్లు కొదమ సింహాల్లా పోరాడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.