12-08-2025 04:36:53 PM
టేకులపల్లి (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గం(Yellandu Constituency)లోని టేకులపల్లి మండల కేంద్రంలో మంగళవారం 97 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కులను పంపిణీ చేశారు. ఇల్లందు క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో రూ.33.10 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా తమ ప్రభుత్వం చూస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. టేకులపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల నాయకులు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, బోడ మంగీలాల్, మధురెడ్డి, సంజయ్, సరిత, భూక్యా శంకర్, సర్దార్, కాలే ప్రసాద్, నర్సింగ్ లక్ష్మయ్య, రాందాస్, బానోత్ రవి, శంకర్,ఈశ్వర్, నవీన్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.