calender_icon.png 10 September, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌సీడీ యాప్స్ రద్దుకోసం కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎంల ధర్నా

09-09-2025 12:28:16 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పట్టణ హెల్త్ సెంటర్స్ లో పని చేస్తున్న ఏఎన్‌ఎంల పై అదనపు పనులు తో వేదిస్తున్నారాని, తక్షణం అదనపు పనులు నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు జిల్లా నలు మూలల నుండి వచ్చిన ఏఎన్‌ఎం లు ఆందోళన లో పాల్గొన్నారు.

ఈ ధర్నా లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతు ఏఎన్‌ఎం గ్రామాల్లో అను నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తూ ఆరోగ్యం రాష్టం గా మెదటి స్థానంలో ఉండే లా కృషి చేస్తున్న వారిపై రోజు కోక్క యాప్స్ పెట్టి అసలు చేయాల్సిన పనులు పక్కకు   పోతున్న అన్నారు. 32 యాప్స్ ఎన్ సి డి, విన్, ఎం సి హెచ్, కె ఐ టి, ఐ డి ఎస్ పి, టీ బీ, ముక్త, భారత్, సికిల్ సెల్ లలో రోజు ఆన్ లైన్ చెయ్యాలి అని అధికారులు వత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఏ ఎన్ సీ టార్గెట్ లు అని, ప్రతి నెల గర్భిణీ లు నమోదు చెయ్యాలని టార్గెట్ పెట్టటం, టార్గెట్ పూ ర్తి కాకుంటే జీతం కట్ చేస్తాం అని ఇబ్బందులు పెట్టటం సరైంది కాదన్నారు. అదనపు పనులు వలన వారి అనారోగ్య సమస్యలు తో బి పి, షుగర్, గుండె జబ్బులు, తో అవస్థలు పడుతున్నారని ఆవేదన యక్తం చేసారు. తక్షణమే అదనపు పనులు రద్దు చెయ్యాలని,  ఎన్ సి డి బంద్ చే యనున్నట్లు తెలిపినారు.

ధర్నా వద్దకు వచ్చిన జిల్లా వైద్య అధికారి జయలక్మి వచ్చి సమస్యలపై అందించిన వినతిపత్రం ను తీసుకోని ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకోని వెళ్తామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో జిల్లా ఏఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు ప్రియాంక,ప్రధాన కార్యదర్శి సారిక, ఉమాదేవి, సీత, శుశిల, ధన లక్ష్మి,శారదా, బాల నాగమ్మ, పుష్ప, ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు,