10-09-2025 03:15:29 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 40 వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ తెలంగాణ ఉద్యమం లో చేసిన కృషిని గుర్తు చేయనుకున్నారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు కొత్త ఇంటి నర్సింలు, ఇస్త్రీ రాజయ్య, సభ్యులు పొన్నం రాజయ్య, దుబ్బాక ఆశన్న, బంధాల రాజు, బాయ్కాడి సాయిలు, సాయిలు, జి. రాజయ్య, నడిపొల్ల సాయిలు, పున్నం లింగం, ఉడతల సాయిలు, ఎంపేట సాయిలు, ఏం పేట హనుమాన్లు, ఉడతల గణేష్, నడిపి సాయిలు, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.