09-09-2025 12:29:06 AM
ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : నకిరేకల్ నియోజకవర్గంలోని ధర్మారెడ్డి, బ్రాహ్మణవెల్లంల, అయిటిపాముల ప్రాజెక్టుల సంభంధించిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.సోమవారం పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియెజకవర్గ పరిధిలోని ధర్మారెడ్డి, బ్రాహ్మణవెల్లంల, అయిటిపాముల, మూసీ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన చర్చించారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.