10-09-2025 03:01:39 PM
బిచ్కుంద, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామంలో బుధవారం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ జి టి యు రాష్ట్ర సెక్రెటరీ విజయ పటేల్ , పి ఆర్ టి యు బిచ్కుంద మండలం ప్రధాన కార్యదర్శి ఇర్షాద్ అలీ, బిచ్కుంద మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ రాజుల మాజీ సర్పంచ్ చంద్రభాగ అశోక్, మాజీ ఉపసర్పంచ్ హనుమంతరావు, రాజుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాంబాయి, శైలజ గ్రామస్తులు పాల్గొన్నారు.