calender_icon.png 18 August, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్న భావు సాఠే సేవలు స్ఫూర్తిదాయకం

18-08-2025 12:00:00 AM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

బిచ్కుంద, ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సాహిత్యరత్న లోక షాహీర్ అన్నా భావు సాఠే 105వ జయంతి సందర్భంగా.. ఆదివారం జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణ వేడుకకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆయన మాట్లాడూతూ...అణగారిన వర్గాలకోసం పోరాడిన గొప్ప భావు సాటే అన్నారు. సమాజం కోసం ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేశారు. దేశ ప్రజల కోసం తన సాహిత్యంతో ప్రజలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు మహిళా సోదరీమణులు రాఖీలు కట్టి హారతి ఇచ్చి అభివాదం తెలిపారు..