17-08-2025 11:36:33 PM
వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా చిన్నరావుపేట, ఖానాపూర్ల ఆరోగ్య కేంద్రాలను ఆదివారం డిఎంహెచ్వో సాంబశివరావు తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించాలని వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు.
వేడి చేసిన నీళ్లను, వేడి పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన పరీక్షలు నిర్వహించాలని కోరారు. డాక్టర్లకు సిబ్బందికి ఎలాంటి సెలవులు ప్రకటించలేదని, సమయపాలన పాటించాలని, ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల కేంద్రాల్లో, హెడ్ కోటర్స్ లో ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.