calender_icon.png 18 August, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ ఇన్‌ఫ్లో

18-08-2025 12:00:00 AM

పెరుగుతున్న నీటి మట్టం.. నేడు జలాశయం వరద గేట్లు తెరిచే అవకాశం

నిజాంసాగర్, ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు ఈ ఈ సోలోమన్ ఆదివారం తెలిపారు. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోని సింగూరు ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, ల ద్వారా వరద నీటి ప్రవాహం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుకుంటుందని దానికి అనుగుణంగా జలాశయంలో నీటిమట్టం ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు.

వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే సోమవారం ప్రాజెక్టులోని వరద గేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరులు రైతులు  మంజీరా నది పరివాహక ప్రాంతానికి వెళ్ళవద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 00అడుగులు కాగా ప్రస్తుతం1401.00 అడుగులతో 12.809 టీఎంసీల నీటినిల్వతో కొనసాగుతుందని ఆయన తెలిపారు.