calender_icon.png 24 January, 2026 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

24-01-2026 12:00:00 AM

ముకరంపురం, జనవరి, 23 (విజయ క్రాంతి) జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనా యి. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం అ ధ్యయనోత్సవం జరిగింది. అలాగే వసంత పంచమి కావడంతో స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు, ఉత్సవమూర్తుల ముందు శ్రీ వైష్ణవ ద్విజులు దెబ్బట శ్రీధరా చార్యులు ,నెమలికొండ రామకృష్ణమాచార్యులు, సముద్రాల విజయసారథి, మధుసూదనాచార్యులు ద్రావిడ వేద పారాయణం చేశారు .

సాయంత్రం పరమపదోత్సవం నిర్వహించారు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. భజనలు కీర్తనలు, పారాయణాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిసిసి అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి, తదితరులతో పాటుగా వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్, అర్చకులు లక్ష్మణాచార్యులు వివిధ సంస్థల కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.