24-01-2026 05:23:11 PM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలి
కేశవపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు డిమాండ్
మంథని,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వీబీజీ, రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు డిమాండ్ చేశారు. శనివారం హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఏల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామములో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంఎన్ ఆర్ ఈజీఏ పేరు మార్పుకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమములో టీపీసీసీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వీబీజీ, రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేశి, తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో, గుంటూరుపల్లి గ్రామంలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేశి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి పరిశీలకులు, ప్రధాన కార్యదర్శి మోత్కురి ధర్మారావు, గ్రామ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.