24-01-2026 05:39:02 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రం చవిటిగూడెం భిక్షం X1 క్రీడాకారులకు అశ్వాపురం ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు జెర్సీలను స్పాన్సర్ చేశారు. ఈ జెర్సీలను శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య చేతులమీదుగా క్రీడాకారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శీనన్న సైన్యం మండల అధ్యక్షులు ముత్తినేని వాసు, కాంగ్రెస్ మండల నాయకులు వేములపల్లి కృష్ణార్జున్, వలబోజు మురళీకృష్ణ, వార్డు సభ్యులు నూకల లింగయ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.