24-01-2026 05:41:28 PM
కుషాయిగూడ షీ టీమ్
దమ్మాయిగూడ,(విజయక్రాంతి): దమ్మాయిగూడ విశాంక్ మోటర్స్ దగ్గర గల ట్రెండ్స్ షాపింగ్ మాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ పాత్ర, గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పిల్లల పై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లింగ సున్నితత్వం అంశాల పై వివరించారు. అలాగే సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, సైబర్ నేరాల్లో భాగంగా బ్యాంక్ అకౌంట్లో నుండి డబ్బులు పోయినప్పుడు వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాల వినియోగం, లోన్ యాప్ మోసాలు, యాంటీ ర్యాగింగ్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు.