24-01-2026 05:36:31 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తాడ్వాయి ఎస్సై స్రవంతి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. లింగ విభేదం లేకుండా విద్యను అభ్యసించినట్లయితే సమాజంలో మంచి అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. విద్య జాతి నిర్మాణంలో ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. సైబర్ నేరాల పై జాగ్రత్తగా ఉండాలన్నారు.
మానవ అక్రమ రవాణా సమాజంలో ఎంతో కీడును తెచ్చిపెడుతుందన్నారు. బాలికలు బాగా చదువుకొని సమాజానికి మంచి చేయాలని సూచించారు. ఎంఈఓ రామస్వామి మాట్లాడుతూ.. బాలికలు బాగా చదువుకొని సమాజానికి మంచి చేయాలని సూచించారు. తమ లక్ష్యాలను సాధించడానికి విద్య అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. బాలికలు తమ భద్రతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటే భద్రత పట్ల అప్రమత్తంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్య ఇన్చార్జి శ్వేత ఉపాధ్యాయులు హేమంత్ కుమార్,గిరి, రమేష్, బాబురావు, శ్రీహరి, రాజు రాజు రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు