calender_icon.png 24 January, 2026 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తా

24-01-2026 06:09:13 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదని, మృతి చెందిన కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. తుంగతుర్తిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అర్వపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎస్ఓ కల్పన, రావులపల్లి హెచ్ఎం పోరెడ్డి గీతలకు నిర్వహించిన సంతాప సభలో శనివారం ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.రోడ్డు ప్రమాదంలో గాయాలైన కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. సమాజంలో విద్యార్థులను బోధన ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తున్న ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. అతి పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు.

ఒకే ప్రమాదంలో ఇరువురు ఉపాధ్యాయ కుటుంబాలను కోల్పోవడం తీవ్రమైన దిగ్భ్రాంతి గురైనట్టు తెలిపారు. స్వయంగా నల్గొండకు వెళ్లి జరిగిన సంఘటన విచారించి, మృతులకు సంతాపం తెలిపినట్లు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఔట్సోర్సింగ్ చేస్తున్న 20వేల మందికి ,పర్మినెంట్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తో మాట్లాడి సభలో చర్చిస్తానని, మృతులకు ఎక్స్గ్రేషియా విషయంలో న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని, హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎంఈఓ లింగయ్య, తుంగతుర్తి పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పాలెపు చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, దాయం ఝాన్సీ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాంబాబు ,  భాస్కర్, మల్లెపాక రవీందర్ వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.