24-01-2026 05:43:42 PM
డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీని ప్రత్యేక వార్డ్ గా గుర్తించాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నందిరామయ్య తదితరులు కోరారు. ఈ మేరకు కాలనీవాసులు గతంలో హైకోర్టును ఆశ్రయించి మభ్యంతర ఉత్తర్వులు మున్సిపల్ శాఖకు పంపించగా శనివారం ఆ కాలనీవాసులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ ఎదుట హియరింగ్ కు హాజరయ్యారు. ఈ మేరకు ఇటీవల డబుల్ బెడ్రూంలో మంజూరైన కాలనీలో సుమారు 400 గృహాలు ఉండగా దీనిలో 1500 మేరకు ఓటర్లు ఉంటారని వీరంతా పట్టణంలోని ఆయా కాలనీలకు చెందిన వారు కాగా వీరి ఓట్లు మున్సిపాలిటీలోని 12 కాలనీలో ఉన్నాయి.
దీంతో డబుల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధి కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారని, డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మున్సిపాలిటీలో ప్రత్యేక వార్డుగా తమను గుర్తించాలని, కాలనీవాసులు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో హియరింగ్ లో కమిషనర్ సుందర్ సింగ్ కు వివరించారు .వివరాలను పై అధికారులకు, హైకోర్టుకు తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నందిరామయ్య, అఖిల్, షేక్ అహ్మద్, దాదా భాయ్, జాదవ్ సునీల్ ,పద్మ, చందన, కలీం ,గోరేమియా, రాజా నరసయ్య, పలువురు పాల్గొన్నారు.