23-04-2025 01:30:34 AM
ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో చోటు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్‌మార్క్ భవనాల జాబితాలో చోటు దక్కించుకుంది. ముంబై తాజ్ హోటల్, స్టాక్ ఎక్సేంజ్ తర్వా త ట్రేడ్ మార్క్ కలిగిన దేశంలోని మూడో కట్టడంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ భవనం నిలిచింది.
ఈ మేరకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాన్ని ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్‌కు ఓయూ పూర్వ విద్యార్థి సుభజిత్ సాహా మంగళవారం అం దజేశారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెందర్ నాయక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్ల సమక్షంలో వీసీ ధ్రువపత్రాన్ని స్వీకరించారు. ఓయూ ప్రతిష్టలో ట్రేడ్‌మార్క్ గుర్తింపు మరో మైలురాయి అని వీసీ ప్రొఫెసర్ కుమార్ అభివర్ణించారు.
ఓయూ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కాలేజీ భవనానికి ఇప్పటి కే ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ట్రేడ్‌మార్క్ గుర్తింపు ద్వారా ఆర్కిటెక్చర్ హక్కుల సంరక్షణ సహా బ్రాండ్ ఇమేజ్‌కు ఉపయోగపడుతుందన్నారు. ఓయూ పూర్వ విద్యార్థి సుభజిత్ సాహా ఆర్ట్స్ కాలేజీ భవన విశిష్టతను, హైదరాబాద్ వారసత్వం, బ్రాండింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేశార న్నారు.
ఓయూ లా కళాశాల సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ట్రేడ్‌మార్క్ సాధనకు అవసరమైన డాక్యుమెంటేషన్ సహకారాన్ని అందించారని తెలిపారు. కాగా ఆర్ట్స్ కాలేజీ ఆర్కిటెక్చర్, నిర్మాణ హక్కులు ఓయూకు దక్కడం ద్వారా ఓయూ అనుమతి లేకుండా ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని ఎలాంటి వాణిజ్య, ప్రకటనలు, ఇతర అవసరాలకు వాడేందుకు అవకాశం ఉండదు.
కాకతీయ టెంపుల్స్ స్పర్శలతో.. బెల్జియన్ వాస్తు శిల్పి ఎర్నెస్ట్ జాస్పర్ ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. ఇప్పటివరకు ఎంఫైర్ ఎస్టేట్ భవనం, క్రిస్లర్ భనవం, యూఎస్‌లోని న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్, ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్ ప్రపంచంలోని ప్రసిద్ధ ట్రేడ్‌మార్క్ భవనాలుగా ఉన్నాయి. ఈ జాబితా లో ఆర్ట్స్ కాలేజీ కూడా చేరింది.